14 ఏళ్లుగా ఉన్న రామ్ చరణ్ రికార్డులను బద్దలు కొట్టిన వైష్ణవ్ తేజ్

Tuesday, February 16th, 2021, 02:00:33 PM IST

మెగా ఫ్యామిలీ కి చెందిన హీరో అంటే ఇప్పుడు మినిమం గ్యారంటీ సినిమా అనే టాక్ ఇండస్ట్రీ లో ఉంది. అయితే 14 ఏళ్ల క్రితం చిరుత చిత్రం తో రామ్ చరణ్ నెలకొల్పిన రికార్డ్ ఏదైతే ఉందో, ఆ రికార్డ్ ను ఇప్పుడు మెగా ఫ్యామిలీ కి చెందిన వైష్ణవ్ తేజ్ బద్దలు కొట్టాడు. చిరుత సినిమా తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తేజ్ సినిమా కి అప్పట్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తొలి చిత్రం తో 25 కోట్ల రూపాయల షేర్ సాధించిన హీరో గా రామ్ చరణ్ ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ రికార్డ్ ను మూడు రోజుల్లో ఉప్పెన చిత్రం తో బద్దలు కొట్టారు.

ఫిబ్రవరి 12 న విడుదల అయిన ఈ చిత్రం మొదటి రోజు నుండి పాజిటివ్ టాక్ తో దూసుకు పోతుంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 10.42 కోట్ల రూపాయల షేర్ సాధించింది ఉప్పెన. ఇప్పటి వరకూ 50 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసి అదే జోరు కనబరుస్తోంది. అయితే రామ్ చరణ్ రికార్డ్ ను అదే ఫ్యామిలీ కి చెందిన హీరో బద్దలు కొట్టడం తో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బుచ్చిబాబు సన దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందించగా, వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్ గా కృతి శెట్టి నటించింది.ఈ చిత్రం లో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ తో ఈ సినిమా ప్రదర్శితవుతుంది.