‘వి’ చిత్రం ట్రైలర్ కి ముహూర్తం ఖరారు!

Tuesday, August 25th, 2020, 12:33:46 AM IST


నాని, సుధీర్ బాబు కలిసి నటించిన వి ది మూవీ విడుదల కి సిద్దం అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్ర హక్కులను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 5 న విడుదల కి సిద్దం కాగా, ఈ చిత్రం ట్రైలర్ కోసం చిత్ర యూనిట్ ముహూర్తం ఖరారు చేసింది. ఈ చిత్ర ట్రైలర్ ను ఆగస్ట్ 25 న ఉదయం 10 గంటలకు అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల కాబోతుంది. ఇందుకు సంబంధించిన అప్డేట్ తాజాగా వెలువడింది.

అయితే టాలీవుడ్ లో ఒక తెలుగు సినిమా, అది కూడా భారీ అంచనాలు నెలకొ న్న నాని సినిమా విడుదల కి సిద్దం కావడం తో ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా, కరోనా వైరస్ మహమ్మారి కారణం గా లాక్ డౌన్ తో ఈ చిత్రం విడుదల ఆగింది.