మనవాళ్ళకి సంగీత పరిజ్ఞానం లేకపోవడంతో కాపీ అంటున్నారు – “వి” మూవీ దర్శకుడు

Friday, September 11th, 2020, 01:23:39 AM IST


ఇటీవల డైరెక్ట్ ఓటిటీ గా విడుదల అయిన “వి” చిత్రం అభిమానుల అంచనాలను అందుకోలేక పోయినా, పర్వాలేదు అనిపించింది. అయితే ఈ చిత్రానికి సంగీత దర్శకుడు థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రానికి థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే సీన్స్ హైలెట్ అయ్యాయి అని చెప్పాలి. అయితే ఈ చిత్రం లో థమన్ వాడిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రాక్షసన్, గేమ్ ఆఫ్ త్రొన్స్ నుండి కాపీ అంటూ విమర్శకులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయం పై దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి క్లారిటీ ఇచ్చారు.

అన్నపూర్ణ స్టూడియోలో కూడా ఆల్రెడీ ఉన్న మ్యూజిక్ నే వాడుతున్నారు ఎంటి అని అడుగుతున్నారు అని తెలిపారు. అయితే రాక్షసన్ లో వచ్చిన బీ జి ఎం, వి చిత్రం లో థమన్ వాడిన బీ జి ఎం రెండు కూడా ఒకేలా కనిపించినా వేర్వేరు అని స్పష్టం చేశారు. అయితే మనవాళ్ళకి సంగీత పరిజ్ఞానం లేకపోవడంతో కాపీ అంటున్నారు అని విమర్శకుల నోళ్లకు కళ్లెం వేశారు. అయితే ఈ ఒక్క సినిమా లో మాత్రమే కాదు, వేరే సినిమాల్లో కూడా సంగీత దర్శకులు కాపీ కొట్టకపోయినా నిందలు వేస్తారు అని అన్నారు. థమన్ ఎంతో ప్రతిభా వంతుడు అని, కాపీ చేయక పోయినా, ఇంతగా గొడవ చేస్తున్నారు అని, అదే ఒకవేళ నిజంగా చేసి ఉంటే ఊహించేవాళ్ళం కాదేమో అని దర్శకుడు తెలిపారు.