నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతున్న ఉప్పెన.. డేట్ ఫిక్స్..!

Friday, April 2nd, 2021, 02:27:35 AM IST


వైష్ణవ్‌తేజ్‌, కృతి శెట్టి జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో నిర్మించిన ఉప్పెన సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 12న రిలీజ్ అయ్యి మంచి సక్సెస్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. కలెక్షన్లను కూడా ఈ సినిమా బాగానే రాబట్టుకుంది. అయితే ఉప్పెన సినిమా తర్వాత వచ్చిన చాలా సినిమాలు ఇప్పటికే ఓటీటీల్లో వస్తున్నా ఈ సినిమా ఇంకా స్ట్రీం కాకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు.

అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందోనని ఓ వర్గం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఏప్రిల్ తుది వారంలో ఓటీటీల్లో విడుదల కావచ్చని టాక్ వచ్చింది. అయితే కొత్తగా దీనికి సంబంధించి కొత్త డేట్ పై క్లారిటీ వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 12న విడుదల చేయనున్నారు. ఈ డేట్ లో ఎలాంటి మార్పులు లేవని, ఈ సారి ఖచ్చితంగా చెప్పిన రోజే సినిమా ఓటీటీలోకి వస్తుందని సమాచారం.