ఉప్పెన చిత్రం పై మహేష్ ప్రశంసల వర్షం… థాంక్స్ చెప్పిన చిత్ర యూనిట్!

Tuesday, February 23rd, 2021, 08:45:39 AM IST


బుచ్చిబాబు సన దర్శకత్వం లో తెరకెక్కిన ఉప్పెన చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కుకురిపిస్తుంది. పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా, కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందించారు. అయితే తొలి ప్రయత్నం లోనే దర్శకుడు, హీరో, హీరోయిన్ సక్సెస్ అవ్వడం పట్ల టాలీవుడ్ ప్రశంసల వర్షం కురిపిస్తున్న తరుణం లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రం పై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా దర్శకుడు ప్రతిభ ను కొనియాడి, సంగీత దర్శకుడు దేవి శ్రీ పై ప్రశంసలు కురిపించారు. అంతేకాక ఉప్పెన లో నటించిన హీరో హీరోయిన్ల నటన అద్భుతం అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించిన సుకుమార్ కి మరియు మైత్రి మూవీ మేకర్స్ కి మహేష్ అభినందనలు తెలియజేశారు.

అయితే మహేష్ చేసిన వ్యాఖ్యల కి చిత్ర యూనిట్ స్పందించింది. మహేష్ ఈ చిత్రం పై స్పందించి ప్రశంసించడం పట్ల థాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు. అయితే మహేష్ మెగా హీరో చిత్రానికి స్పందించడం పట్ల అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.