ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య దూకుడు…నెట్ ఫ్లిక్స్ లో టాప్ 5 లో.!!

Saturday, August 1st, 2020, 02:41:12 AM IST


లాక్ డౌన్ ఎఫెక్ట్ తో ఆన్లైన్ బాట పట్టాయి తెలుగు సినిమాలు. ఇప్పటి వరకు పెద్ద పెద్ద సినిమాలు విడుదల కాకపోయినా, ఓటిటీ ల ద్వారా చిన్న చిన్న సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా విడుదల అయిన ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య చిత్రం తన దూకుడు ను చూపిస్తోంది. విడుదల అనంతరం పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రానికి వ్యూస్ ఎక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో టాప్ 5 గా కొనసాగుతుండటం విశేషం.

కేరాఫ్ కంచర పాలెం చిత్రం తో విజయాన్ని అందుకున్న దర్శకుడు వెంకటేష మహా ఈ చిత్రాన్ని చాలా అద్బుతం గా తెరకెక్కించారు. బాహుబలి చిత్రాల అనంతరం నిర్మాతలు తీసిన చిత్రం కావడం తో ప్రేక్షకులు ఈ చిత్రం పై అంచనాలు పెట్టుకున్నారు. అయితే అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం విజయం సాధించడంతో చిత్ర యూనిట్ సంబరం లో ఉన్నట్లు తెలుస్తోంది. సత్య దేవ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం విజయ బాట లో నడుస్తోంది అని చెప్పాలి.