అలవైకుంఠపురంలో సినిమా ఖాతాలో మరో రికార్డ్..!

Saturday, December 5th, 2020, 09:00:49 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురంలో నిత్యం ఏదో ఒక విషయంలో రికార్డులు సెట్ చేస్తూనే వస్తుంది. ఇప్పటికే అత్యధిక ఫాలోవర్లు కలిగిన సౌత్ హీరోగా ఇటీవలే అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించాడు.

అయితే తాజాగా ఈ సినిమా తన ఖాతాలో మరో రికార్డును నమోదు చేసుకుంది. ఈ ఏడాది ఎక్కువ మంది వీక్షించిన ట్రైలర్ల టాప్-20 జాబితాలో అలవైకుఠపురంలో సినిమా ట్రైలర్ నిలిచింది. అయితే దక్షిణాది నుంచి ఈ చిత్రం ఒక్కటే ఉండడం విశేషం. ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.