‘టాలీవుడ్’ కు ఏమైంది..?

Monday, December 21st, 2015, 07:49:22 PM IST


తెలుగు చిత్ర పరిశ్రమ ‘టాలీవుడ్’ గత కొన్ని రోజులుగా విషాదంలో మునిగిపోయింది. కళాకారుల వరుస మరణాలతో కన్నీరు పెడుతోంది. గతంలో హాస్యనటులైన ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీఎస్, ఎం ఎస్ నారాయణ, కళ్ళు చిదంబరం, కొండవలస వంటి ప్రముఖులు మరణించగా ప్రస్తుతం గత పది రోజులుగా వరుసగా సంభవించిన 5గురి మరణాలు టాలీవుడ్ ను మరింత కలిచివేశాయి.

ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ తండ్రి, రచయిత సత్యమూర్తి, అదే రోజున మరో రచయిత శ్రీనివాస్ చక్రవర్తి మరణించగా ప్రముఖ నటులకు శిక్షకుడిగా పని చేసిన రంగ స్థల నటుడు చాట్ల శ్రీరాములు గత శనివారం మరణించారు. ఆ తరువాత వెంటనే టాలీవుడ్ సీనియర్ నటుడు రంగనాథ్ ఆత్మహత్య చేసుకొని మరణించటం అందరినీ మరింత భాధకు గురిచేసింది. ఈ వరుస మరణాలు చూసిన సినీ జనాలు ‘అయ్యో ఈ టాలీవుడ్ కు ఏమైంది..? ఏమైనా శాపం తగిలిందా..?’ అని మనో వేదన చెందుతున్నారు.