టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ తేజ కి సోకిన కరోనా!

Monday, August 3rd, 2020, 06:52:10 PM IST

టాలీవుడ్ లో సైతం కరోనా వైరస్ భారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇప్పటికే దర్శక ధీరుడు రాజమౌళి కి కరోనా వైరస్ పాజిటివ్ రావడం తో అంతా అప్రమత్తం అయ్యారు. తాజాగా మరొక టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ తేజ కు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే ఈ విషయాన్ని స్వయంగా తేజ నే వెల్లడించారు. అయితే ఇటీవల షూటింగ్ లో పాల్గొన్న తేజ చిత్ర యూనిట్ లో ఒకరికి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకున్నారు తేజ కి పాజిటివ్ అని తేలింది.

అయితే తనకు కరోనా వైరస్ సోకడం పట్ల తేజ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ ఇంట్లో ఉంది కరోనా వైరస్ తెచ్చుకుంటే నేను మాత్రం షూటింగ్ కి వెళ్లి కరోనా వైరస్ తెచ్చుకున్నా అని అన్నారు. అయితే షూటింగ్ లో పాల్గొన్న వారికి గాని, తన కుటుంబ సభ్యులకు ఎవరికి కరోనా వైరస్ సొకలేదు అని, తన ఇక్కడికి మాత్రమే వచ్చినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా వైరస్ భారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. తేజ అభిమానులు త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.