చిరు “ఆచార్య” టీజర్ పై పెరుగుతున్న అంచనాలు

Wednesday, January 27th, 2021, 08:36:46 AM IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రం విడుదల కి సిద్దం అవుతోంది. గతేడాది ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా, కరోనా వైరస్ విపత్తు కారణం గా షూటింగ్, విడుదల వాయిదా పడింది. అయితే ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ఇంకా విడుదల కాలేదు.అయితే ఈ చిత్రం టీజర్ విడుదల కి సంబందించి చిరు మరియు దర్శకుడు కొరటాల శివ మధ్యలో జరిగిన సంభాషణ ను చిరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏమయ్యా కొరటాల, ఆచార్య టీజర్ న్యూ ఇయర్ కి లేదు, సంక్రాంతి కి లేదు, ఇంకెప్పుడు అంటూ అడిగారు. అదే పనిలో ఉన్నా అంటూ శివ చెప్పుకొచ్చారు. అయితే ఎప్పుడో చెప్పకపోతే లీక్ చేయడానికి సిద్దంగా ఉన్నా అంటూ చిరు చెప్పుకొచ్చారు. అయితే రేపు మార్నింగ్ అనౌన్స్ చేస్తా అంటూ కొరటాల శివ అన్నారు. ఇస్తావ్ కదా అంటూ చిరు మళ్ళీ అడగ్గా, ఉదయం 10 గంటలకు అంటూ చెప్పుకొచ్చారు.

అయితే బుధవారం నాడు ఉదయం 10 గంటలకు ఆచార్య టీజర్ ఎప్పుడు అనేది ప్రకటించనున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి కి మరియు కొరటాల శివ కి మధ్యలో జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ రేంజ్ లో సినిమా కి సంబంధించిన విషయాలను వెల్లడించడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి తో పాటుగా, రామ్ గోపాల్ కూడా కీలక పాత్ర లో నటిస్తున్నారు. ఈ చిత్రం లో చిరు కి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. చిరు, కొరటాల శివ ల ఆచార్య టీజర్ కి ముహూర్తం ఫిక్స్ కానుండటంతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.