ప్రభాస్ సినిమా ఫస్ట్ లుక్‌కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..!

Wednesday, July 8th, 2020, 12:31:16 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 20వ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. జిల్‌ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ పీరియాడిక్‌ రొమాంంటిక్‌ డ్రామాహా తెరకెక్కుతున్న ప్రభాస్ కొత్త సినిమా నుంచి త్వరలోనే ఫస్ట్ లుక్ రాబోతుంది.

అయితే ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్నా మిగతా షూటింగ్‌కి కరోనా కారణంగా బ్రేక్‌ పడింది. అయితే సినిమా షూటింగ్ ప్రారంభమై ఇన్ని రోజులు అవుతున్నా ఇంకా ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర యూనిట్ ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ నెల 10 తేదిన సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ పోస్ట్‌ను రిలీజ్‌ చేస్తున్నట్టుగా అఫిషియల్‌గా ప్రకటించారు.