ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా పై పెరుగుతున్న అంచనాలు

Monday, January 4th, 2021, 08:22:50 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి అటు క్లాస్, ఇటు మాస్ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ నటనకు, స్టెప్పులకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అయితే ప్రస్తుతం రౌద్రం రణం రుధిరం చిత్రం లో కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్, వచ్చే ఏప్రిల్ నెల నుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో నటించేందుకు సిద్దం అవుతున్నారు. ఎన్టీఆర్ 30 వ చిత్రానికి అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అయితే ఇప్పటికే ఈ చిత్రం లో బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్, కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, మలయాళ నటుడు జయరామ్ నటించనున్నారు అని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ అభిమానులను అలరిస్తోంది. ఈ చిత్రం లో ఎన్టీఆర్ సరసన ముగ్గురు హీరోయిన్స్ నటించనున్నట్లు సమాచారం. అందులో ఒకరు బాలీవుడ్ బ్యూటీ క్వీన్ జాన్వీ కపూర్. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. మరొక ఇద్దరినీ కూడా త్వరలోనే తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్టీఆర్ సినిమాల్లో మాత్రమే కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాల్లో కూడా హీరోయిన్స్ ఇద్దరేసి ఉండటం ఇప్పటి వరకూ చూశాం. మరి ఈ చిత్రం లో ఇంకెన్ని విశేషాలు ఉన్నాయో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.