సుకుమార్ మెచ్చిన ఆ నటుడు “పుష్ప” లో!?

Sunday, August 30th, 2020, 01:54:58 PM IST

లెక్కల మాస్టర్ అయిన దర్శకుడు సుకుమార్ తన విజయాల పరంపర ను కొనసాగిస్తున్నారు. అయితే పుష్ప చిత్రం కోసం సుకుమార్ మరొక కీలక నటుడు ని తీసుకోనున్నారు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం చిత్రాల్లో నెగటివ్ షేడ్స్ లో, విలన్ పాత్రలో కనిపించిన జగపతి బాబు ను సుకుమార్ అంత తేలిగ్గా వదిలి పెట్టేలా లేరు. పుష్ప చిత్రం లో ఒక ముఖ్యమైన పాత్ర కోసం జగపతి బాబు నీ సుకుమార్ సంప్రదించినట్లు సమాచారం. అయితే స్క్రిప్ట్ విన్న అనంతరం జగపతి బాబు, సుకుమార్ మీద ఉన్న నమ్మకం తో ఈ చిత్రం లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే ఇప్పటికే సుకుమార్ అల్లు అర్జున్ తో ఆర్య, ఆర్య2 అంటూ రెండు సినిమాలు చేశారు. ముచ్చటగా మూడో సారి వీరి కాంబో లో సినిమా వస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అల వైకుంఠ పురం లో చిత్రం తో ఫుల్ జోష్ లో ఉన్న అల్లు అర్జున్ అదే జోష్ తో ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొనేందుకు సిద్దం అయ్యారు. ఈ చిత్రం లో కథానాయిక గా రష్మిక నటించనున్నది. తెలుగు లో పాటుగా ఈ చిత్రం ఇతర భాషల్లో కూడా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.