రాసిపెట్టుకొండి..”మహర్షి”లో ఈ సీన్ హైలైట్ !

Thursday, February 14th, 2019, 03:32:56 PM IST

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “మహర్షి”.పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.అయితే ఈ సినిమా రైతులను ఉద్దేశించి మంచి కాన్సెప్ట్ తో రాబోతుందని ఇప్పటికే చాలా మందికి తెలిసిన సమాచారం.కానీ ఇప్పుడు ఈ సినిమాలో ఒక సీన్ మహేష్ అభిమానులతో థియేటర్లలో విజిల్లతో పాటు చప్పట్లు కూడా కొట్టించబోతుందని అంతర్గత సమాచారం.

ఈ సినిమాలో మహేష్ ఒక రైతు పాత్రలో కూడా కనిపించనున్నారన్న సంగతి అందరికి తెలిసినదే..అయితే ఇప్పుడు దానికి సంబంధించే ఒక సీన్ హైలైట్ కానున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమాలో కథానుసారం రైతుగా మారిన మహేష్ పొలంలో నాగలి పట్టి దుక్కి దున్నారట.ఈ సీన్ ని వంశీ చాలా అందంగా,అభిమానులకు నచ్చే విధంగా ఎలివేట్ చేస్తూ తెరకెక్కించినట్టు కూడా సమాచారం.దీన్ని బట్టి వీరు ముందుగా చెప్పనట్టు “వ్యవసాయమంటే దండగ కాదు పండగ” అని వందకి వంద శాతం న్యాయం చేసేలా ఉందనే చెప్పాలి.