తారక్ సినిమాలో ఈ హీరో లేడు..!

Sunday, July 5th, 2020, 11:23:38 PM IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో “రౌద్రం రణం రూధిరం” అనే భారీ పీరియాడిక్ చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనితో పాటుగా తారక్ చేతిలో ఇప్పుడు మరో రెండు భారీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. వాటిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న “అయినను పోయి రావలె హస్తినకు” అనే చిత్రం కూడా ఒకటి.

అయితే ఇందులోనో లేక దర్శకుడు ప్రశాంత్ నీల్ తో తీయబోయే సినిమాకో కానీ మన టాలీవుడ్ యాక్షన్ హీరో మంచు మనోజ్ విలన్ రోల్ లో కనిపించనున్నారని పలు కథనాలు టాలీవుడ్ లో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. దీనితో ఈ చిత్రంలో మంచు మనోజ్ కన్ఫర్మ్ అని అంతా ఫిక్స్ అయ్యిపోయారు. ఎలాగో ఇద్దరి కటౌట్ లు ఒకేలా ఉంటాయి పైగా నిజ జీవితంలో వీరు మంచి స్నేహితులు కూడా కాబట్టి ఈ వార్త మరింత హల్ చల్ చేసింది.

కానీ ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ఏమిటంటే ఈ చిత్రంలో మంచు మనోజ్ నటిస్తున్నాడన్న వార్తల్లో ఎలాంటి నిజమూ లేదని తెలుస్తోంది. ప్రస్తుతం మంచు మనోజ్ తన కం బ్యాక్ సినిమా “అహం బ్రహ్మాస్మి” తో రెడీగా ఉన్నాడు.