తారక్ కు కత్తి చికెన్ పెడతా అంటున్న ఈ కాంట్రవర్సీ వ్యక్తి.!

Wednesday, May 20th, 2020, 11:49:05 AM IST

ఈరోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా తన అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తారక్ నటిస్తున్న రౌద్రం రణం రుధిరం సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోయినప్పటికీ తారక్ పై అభిమానం ఉన్న పలువురు సెలెబ్రెటీలు మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను నిరాశ పరచకుండా కొన్ని సర్ప్రైజ్ లు కూడా ప్లాన్ చేసారు.

అలా యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొట్ట మొదటి సారిగా బుల్లితెర మీద అడుగు పెట్టిన సెన్సేషనల్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ మొదటి సీజన్ కంటెస్టెంట్స్ అంతా కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక వీడియోను వదిలారు. అందులో బిగ్ బాస్ సీజన్ కంటెస్టెంట్స్ అంతా తారక్ తో తన అనుభూతులు తెలుపగా కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయ్యిన కత్తి మహేష్ మాత్రం ఈ లాక్ డౌన్ అయ్యిపోయాక ఒకసారి కలిసి తన కత్తి చికెన్ వండి పెడతా అని అంటున్నాడు. ఇలా మొత్తంగా అందరు కంటెస్టెంట్స్ తమదైన శైలిలో తారక్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.