కొరటాల శివ – బన్నీ చిత్రం పై అప్పుడే మొదలైన గాసిప్!

Tuesday, August 4th, 2020, 12:54:41 AM IST


టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ గా రానున్న #aa21 పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే మొదటి సారిగా అల్లు అర్జున్ ను కొరటాల డైరెక్ట్ చేయనున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడటం తో అభిమానులు ఆనందం లో ఉన్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఒక వార్త అపుడే సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

మాస్ ఎలిమెంట్స్ తో సోషల్ మెసేజ్ ను ఇవ్వగల సత్తా ఉన్న డైరెక్టర్ కొరటాల శివ. ఎలాంటి మాస్ పాత్ర నైనా అలవోకగా చేసే నటుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అయితే ఈ చిత్రం లో అల్లు అర్జున్ స్టూడెంట్ లీడర్ గా కనిపింబోతున్నాడు అని, వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటన ఆధారంగా కథ ఉండబోతుంది అని సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది. అయితే దీని పై మాత్రం ఇంకా చిత్ర యూనిట్ స్పందించలేదు. అయితే అభిమానులు మాత్రం కొందరు ఈ పుకార్ల పై విమర్శలు చేస్తున్నారు.