ఆ నాలుగు సినిమాలు ఆగస్ట్ లోనే?

Friday, January 29th, 2021, 09:13:07 AM IST

కరోనా వైరస్ మహమ్మారి కారణం గా గతేడాది సినిమాలు అన్నీ కూడా విడుదల కాకుండా వాయిదా పడ్డాయి. కొన్ని సినిమాలు ధైర్యం చేసి ఈ ఏడాది సంక్రాంతి కి రిలీజ్ అయ్యాయి. అయితే కరోనా వైరస్ తీవ్రత తగ్గి, థియేటర్ల లో వంద శాతం సిట్టింగ్ కెపాసిటీ పెరిగే వరకూ ఇంకో రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఈ మేరకు సినిమాలు అన్నీ కూడా మెల్లగా విడుదల కానున్నాయి. అయితే ఆగస్ట్ నెలలో మాత్రం నాలుగు పెద్ద సినిమాలు ధియేటర్ లలో సందడి చేయనున్నాయి.

ఇప్పటికే పుష్ప చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. ఆగస్ట్ 13 న ఈ చిత్రం విడుదల అంటూ లాక్ చేసేసింది. మరొక బిగ్గెస్ట్ ఫిల్మ్ అయిన ఎఫ్ 3 కూడా ఆగస్ట్ లోనే విడుదల కానుంది. ఆగస్ట్ 27 కి అంటూ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. అయితే నేడు అడివి శేష్ మేజర్ చిత్రం రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ చిత్రం ఆగస్ట్ ఆరవ తేదీన విడుదల కానున్నట్లు సమాచారం. అదే విధంగా అజయ్ భూపతీ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వస్తున్న మహా సముద్రం చిత్రం ఆగస్ట్ 19 కి విడుదల కానున్నట్లు సమాచారం. ఇలా చూసుకుంటే ఈ ఏడాది ఆగస్టు నెల హౌజ్ ఫుల్ అని చెప్పాలి. ఇంకా భారీ బడ్జెట్ చిత్రాలు కూడా విడుదల తేదీ ను ప్రకటించాల్సి ఉంది.