ఆ విషయం లో వెనక్కీ తగ్గేదే లేదు అంటున్న జక్కన్న!

Friday, May 22nd, 2020, 10:52:49 PM IST

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్ర షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఇద్దరూ కలిసి చేస్తున్న చిత్రం కావడం తో ఆచితూచి అడుగులు వేస్తున్నారు జక్కన్న. అయితే లాక్ డౌన్ కారణంగా షూటింగ్ దాదాపు రెండు నెలలకు పైగా వాయిదా పడింది. అయితే ఈ విషయం లో రాజమౌళి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.

జనవరి 8 న ఎట్టి పరిస్థితుల్లోనూ రౌద్రం రణం రుధిరం చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇంకా మిగిలి ఉంది. స్క్రిప్ట్ విషయంలో ఇపుడు జక్కన్న కొన్ని మార్పులు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో పాటుగా, మిగతా చిత్ర యూనిట్ తో ఈ విషయం పై చర్చించిన అనంతరం ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

అయితే ఇప్పటికే చిత్ర షూటింగ్ దాదాపు పూర్తయినట్టే. కాకపోతే యాక్షన్ మరియు ఔట్ డోర్ షూటింగ్ ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అని బావిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జూన్ నుండి చిత్ర షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. అయితే ఈ చిత్రం రాజమౌళి అనుకున్న సమయానికి వస్తుందా లేదా అనేది ఇంకా ప్రశ్నార్థకమే!