థియేటర్లు తెరుచుకునేది ఈ స్టేటస్ తర్వాతే అట.!

Wednesday, June 3rd, 2020, 02:50:06 PM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా దెబ్బతో అనేక పరిశ్రమలు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. అలాంటి వాటిలో సినీ పరిశ్రమ కూడా ఒకటి. దీనితో థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయా అని సినీ లవర్స్ ఎదురు చూస్తున్నారు.

అయితే ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ జూన్ తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. అది కూడా ఖచ్చితంగా ఉంటుందని చెప్పలేమని నిపుణులు అంటున్నారు.

జూన్ తర్వాత దేశంలో కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో దానిని బట్టి ఒక ఫైనల్ డెసిషన్ ప్రభుత్వం తీసుకుంటుందని తెలుస్తుంది. ఇప్పుడైతే మన దేశంలో కరోనా ప్రభావం ఒక్కో రోజుకి మరింత స్థాయిలో ఉదృత రూపం దాలుస్తుంది.

మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మళ్ళీ థియేటర్స్ కు పూర్వ వైభవం ఎప్పుడు వస్తుందో చూడాలి.