ఏం ట్విస్ట్ ఇచ్చావ్ రామయ్యా..పోయి పోయి అతనికే పంపాలా!

Friday, March 27th, 2020, 10:29:21 AM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ల మధ్య ఎలాంటి సాన్నిహిత్యం ఉందో మన అందరికీ తెలుసు. ఇప్పుడు వీరిద్దరూ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో “రౌద్రం రణం రుధిరం” అనే భారీ ఎపిక్ పీరియాడిక్ వండర్ లో నటిస్తున్నారు.

అయితే గత కొన్నాళ్ల నుంచి అప్డేట్ కోసం ఉవ్విళ్ళూరుతున్న సందర్భంలో ఈ మార్చ్ లో రామ్ చరణ్ పుట్టినరోజు ఉండగా దానికి ఖచ్చితంగా ఏదొక అప్డేట్ ఉంటుంది అని అనుకున్నారు. కానీ దాని ముందే ఊహించని బహుమతి ఇచ్చి జక్కన్న ఆశ్చర్యపరిచారు.

కానీ పుట్టిన రోజు పుట్టిన రోజేగా సో చరణ్ పుట్టినరోజుకు గాను నేను ఒక స్పెషల్ గిఫ్ట్ ప్లాన్ చేశా అని తారక్ ఒక ట్వీట్ పెట్టి దాన్ని ఈరోజు ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని చెప్పారు. తీరా సమయం కావస్తున్నా సందర్భంలో అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో తారక్ పెట్టిన ట్వీట్ చూసి చరణ్ అభిమానులు నవ్వాలో ఏడవాలో అర్ధం కానీ డైలమాలో పడిపోయారు.

చరణ్ కు సారి చెప్తూ నేను ప్లాన్ చేసిన గిఫ్ట్ ఎలా ఉందో ఒక కన్ఫర్మ్ చేసుకుందామని ముందు రాత్రి జక్కన్నకు పంపానని ఇక తెలిసిందేగా రాజమౌళి దగ్గరకు వెళ్తే ఎప్పటిలానే అది కాస్త లేట్ అవుతుంది అని ట్వీట్ పెట్టారు దీనితో కొంతమంది నవ్వుకుంటూనే ఆ అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయినా తారక్ ఎంత పని చేశావయ్యా..