బాలు సర్, మీరు త్వరగా కోలుకోవాలి – రజనీకాంత్

Monday, August 17th, 2020, 06:10:03 PM IST

ఆగస్ట్ 5 న కరోనా వైరస్ భారిన పడి చెన్నై లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో చేరారు లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. అయితే కరోనా వైరస్ భారీ నుండి త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు, సినీ నటులు, రాజకీయ నాయకులు, అభిమానులు ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నారు. అయితే ఎస్పీ బాలు కోలుకోవాలని తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ట్విట్టర్ ద్వారా కోరుకున్నారు. అందుకు సంబంధించిన ట్వీట్ కాస్త ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ప్రియమైన బాలు సర్ అంటూ సంబోధిస్తూ ఇలా అన్నారు. మీరు త్వరగా కోలుకోవా లి అని అన్నారు. ఎస్పీ బాలు గారు 5 దశాబ్దాలకు పైగా తన మ గానం తో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించారు అని అన్నారు. కొద్ది రోజుల క్రితం కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది అని అన్నారు. అయితే బాలు గారి ఆరోగ్యం నిలకడగానే ఉందని, అనారోగ్యం నుండి కోలుకుంటున్నారు అని తెలిసి ఎంతో సంతోషిస్తున్నాను అని రజినీకాంత్ అన్నారు. ప్రస్తుతం ఆయనకి చికిత్స కొనసాగుతుంది అని, ఆరోగ్యం గా మారి సాధారణ స్థితి కి రావడానికి కి కొంత సమయం పడుతుంది అని, ఆయన ఆరోగ్యంగా ఉండలను నేను ప్రార్థిస్తున్నా అని అన్నారు.