ఇది మీకోసమే మహేష్ బాబు గారు

Tuesday, August 11th, 2020, 11:33:50 PM IST


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన పుట్టిన రోజున మొక్కలు నాటి, తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. అయితే అదే విధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను తమిళ్ సూపర్ స్టార్ ఇళయ దళపతి విజయ్ కి, నందమూరి తారక రామారావు కి, హీరోయిన్ శృతి హాసన్ కి విసిరారు. అయితే ఈ ఛాలెంజ్ ను తమిళ్ సూపర్ స్టార్ విజయ్ స్వీకరించారు.

అయితే మొక్కలు నాటి సోషల్ మీడియా ద్వారా అందుకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేశారు. ఇది మీకోసమే మహేష్ బాబు గారు అంటూ విజయ్ తెలిపారు. మహేష్ బాబు కి కృతజ్ఞతలు తెలిపారు. స్టే సేఫ్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే విజయ్ చేసిన ఈ పని సోషల్ మీడియా లో కాస్త వైరల్ గా మారింది. ఒక సూపర్ స్టార్ చేసిన పని మరొక సూపర్ స్టార్ అంగీకరించి మొక్కలు నాటడం హాట్ టాపిక్ గా మారింది.