హాట్ టాపిక్: మరొకసారి పవన్ చిత్రంలో తమన్నా!?

Thursday, July 2nd, 2020, 11:37:58 AM IST

బాలీవుడ్ లో పింక్ చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. అదే చిత్రాన్ని పవన్ కళ్యాణ్ తెలుగు లో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం లో పవన్ తో పాటుగా అంజలి, నివేదా థామస్ లు నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం లో పవన్ సరసన హీరోయిన్ గా నటించేందుకు తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ చిత్రం లో పవన్ సరసన నటించే హీరోయిన్ తల్లి పాత్రను కూడా పోషించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే కెమరా మెన్ గంగతో రాంబాబు చిత్రంలో నటించి మెప్పించిన తమన్నా, మరోసారి పవన్ తో జత కట్టేందుకు సిద్దం అయినట్లు తెలుస్తోంది.

అయితే రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తునే పవన్ కళ్యాణ్ ఈ చిత్రం తో దాదాపు మూడేళ్ళ తరువాత వెండి తెర పై కనిపించనున్నారు. ఈ చిత్రం పై దర్శక నిర్మాతలు సైతం భారీ అంచనాలు పెట్టుకున్నారు. పవన్ కల్యాణ్ సినిమా మొదలైన టైమ్ నుండి అభిమానులు ఈ చిత్రం విడుదల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ షూటింగ్ పూర్తి స్థాయిలో చిత్రీకరణ జరిపేందుకు సిద్దం అవుతుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.