“సర్కారు వారి పాట” కోసం ఎదురుచూస్తున్నా – సూర్య

Thursday, November 19th, 2020, 09:04:52 AM IST


సూర్య నటించిన సురారై పోట్రు చిత్రం తెలుగు లో ఆకాశం నీ హద్దు రా గా విడుదల అయి అశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల అయిన ఈ చిత్రం విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. సుధా కొంగర దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం ను కేవలం తమిళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా, తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని ఇటీవల చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇందుకు సంబంధించి సోషల్ మీడియా లో ఒక పోస్ట్ చేశారు.

సూర్య నటించిన ఈ సూరారై పొట్రు చిత్రం చాలా ఇన్స్పైరింగ్ అంటూ మహేష్ బాబు పేర్కొన్నారు. దర్శకత్వ ప్రతిభ తో అద్భుతమైన నటులతో తెరకెక్కించిన చిత్రం అంటూ కొనియాడారు. సూర్య టాప్ ఫామ్ కొనసాగిస్తున్నారు అని తెలిపారు. అంతేకాక చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు. అయితే సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న మహేష్ బాబు చేసిన ట్వీట్ కి సూర్య స్పందించారు. మహేష్ కి కృతజ్ఞతలు తెలిపి, సర్కారు వారి పాట కోసం ఎదురుచూస్తున్నా అని సూర్య పేర్కొన్నారు. అయితే మహేష్, సూర్య ల సంభాషణల తో ఈ చిత్రం కి మరింత హైప్ క్రియేట్ తోడు అయింది. అటు సూర్య అభిమానులు, ఇటు మహేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.