మహేష్ ఫ్యాన్స్ కు సూపర్ గిఫ్ట్ రాబోతోందా.?

Wednesday, August 5th, 2020, 05:30:15 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన గత మూడు సినిమాలు ఏ రేంజ్ లో హిట్టయ్యాయో అందరికీ తెలిసిందే. దీనితో ఇదే బ్లాక్ బస్టర్ హవా ను కొనసాగించాలని చాలా గ్యాప్ అనంతరం దర్శకుడు పరశురాం తో ఒక పవర్ ఫుల్ మాస్ సబ్జెక్ట్ ను ఎన్నుకొన్నారు, అదే “సర్కారు వారి పాట”.

టైటిల్ మరియు ప్రీ లుక్ పోస్టర్స్ తోనే అదిరిపోయే రెస్పాన్స్ ను రాబట్టిన మహేష్ ఒక్కసారిగా అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లిన వారయ్యారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. ఈ ఆగస్ట్ 9 మహేష్ పుట్టిన రోజు కావడంతో ఏదొక అధికారిక అప్డేట్ రావడం ఖాయమని తేలింది.

అయితే అదేంటో కూడా ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఈసారి సూపర్ స్టార్ మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఒక పవర్ ఫుల్ డైలాగ్ తో కూడిన టీజర్ క్లిప్ ను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే కనుక నిజం అయితే మహేష్ ఫ్యాన్స్ కు ఆరోజు సరైన మాస్ ఫీస్ట్ అని చెప్పాలి.