ట్విట్టర్ లో దుమ్ము రేపుతున్న మహేష్ ఫ్యాన్స్..!

Sunday, August 9th, 2020, 05:15:28 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు ఈ రోజు కావడంతో తారా స్థాయిలో సంబరాలు జరుగుతున్నాయి. మహేష్ కల్ట్ ఫ్యాన్స్ అయితే అయితే ట్విట్టర్ లో తుక్కు రేగ్గొడుతున్నారు. మన స్టార్ హీరోల అభిమానుల ట్విట్టర్ సంబరాలు అంటేనే ఓ రేంజ్ లో ఉంటాయి. అందులో ముఖ్యంగా మహేష్ అభిమానులు ఖచ్చితంగా ముందు వరుసలో ఎల్లప్పుడూ ఉంటూనే ఉంటారు.

అలా ఈసారి బాబు పుట్టిన రోజుకు ఏకంగా వరల్డ్ రికార్డునే టార్గెట్ గా పెట్టుకున్నారు. అంతే ఇక నిన్నటి నుంచి నాన్ స్టాప్ గా ట్విట్టర్ లో దంచేస్తున్నారు. కేవలం నిమిషాల్లోనే భారీ రికార్డులు నెలకొల్పుతూ దడదడలాడిస్తున్నారు. 24 గంటలు దాటక ముందే 50 మిలియన్ ట్వీట్లు కొట్టి దుమ్ము రేపారు. ఇంకా హవా అలా కొనసాగిస్తూనే ఉన్నారు. మరి లాంగ్ టైం లో ఎంత రికార్డు సెట్ చేస్తారో చూడాలి. వీరి తర్వాత ఈ రికార్డు బ్రేక్ చేసేందుకు పవన్ ఫ్యాన్స్ ఈలోపున ప్లాన్ చేస్తున్నారు.