సూపర్ స్టార్ లైనప్ మాములుగా లేదుగా..!

Tuesday, August 4th, 2020, 12:08:50 PM IST

మన టాలీవుడ్ లో ఎప్పుడు కాస్త వైవిధ్య చిత్రాలను చేసే స్టార్ హీరోల జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుంటారని చెప్పాలి. అయితే ఈ మధ్య కాలంలో ఆయన చేసిన కొన్ని ప్రయోగాలు విఫలం కావడంతో మళ్లీ కమర్షియల్ ఫార్మాట్ లోకి వచ్చేసారు. ఇప్పుడు అలానే దర్శకుడు పరశురాం తో “సర్కారు వారి పాట” అనే మాస్ ఫ్లిక్ ను చేస్తున్నారు.

ఇప్పటికే దీనిపై భారీ అంచనాలు నమోదు కాగా తన తర్వాత ప్రాజెక్ట్ పై అప్పుడే సరికొత్త బజ్ వినిపిస్తోంది. కోలీవుడ్ లో “ఖైదీ” అనే థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ ను అందుకున్న దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ ఆ తర్వాత అక్కడ స్టార్ హీరో విజయ్ తో సినిమా చేసి 300 కోట్ల మార్కెట్ వైపు తిరిగిపోయాడు. ఇప్పుడు ఈ దర్శకునితో మహేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయనున్నట్టు ఇప్పుడు టాక్ వినిపిస్తుంది. ఇక కాంబో కనుక సెట్ అయ్యినట్టైతే మరో బై లాంగువల్ సినిమా రావడం ఖాయం అని చెప్పాలి.