ఎఫ్3 లో కీలక పాత్రలో కనిపించనున్న సునీల్

Monday, October 12th, 2020, 08:40:27 PM IST


కమెడియన్ సునీల్ మళ్లీ ఫాం లోకి వచ్చేందుకు చాలా కష్ట పడుతున్నారు. కమెడియన్ గా ఉన్నపుడు వరుస చిత్రాలతో అలరించిన సునీల్, హీరో గా మాత్రం నిలదొక్కుకోలేక పోయారు. అయితే మళ్ళీ పల్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ తెర పై నవ్వులు పూయిస్తున్నారు. అయితే ఎఫ్ 2 చిత్రం టాలీవుడ్ లో ఎంత భారీ విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ రానున్న సంగతి తెలిసిందే.

అయితే ఎఫ్ 2 లో వెంకటేశ్ మరియు వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించగా, ఈ సీక్వెల్ లో మాత్రం సునీల్ వీరికి తోడు అవ్వనున్నారు. అయితే దీని పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే సునీల్ ఈ చిత్రం లో కన్ఫర్మ్ అయితే ఇక సునీల్ కి తిరుగు లేదు అని చెప్పాలి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన పలు చిత్రాల్లో సునీల్ మళ్లీ కమెడియన్ గా రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.