బర్త్ డే రోజు అల్లు అర్జున్ కి సుకుమార్ ట్రీట్!

Monday, April 6th, 2020, 11:00:05 PM IST

అల్లు అర్జున్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు వచ్చేస్తుంది. అయితే సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. షూటింగులు సైతం ఆగిపోయాయి. అయితే అల్లు అర్జున్ చిత్రానికి సంబంధించిన అప్డేట్ కోసం అభిమానులు ఇక ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ 8 న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఆ చిత్రానికి సంబంధించిన అప్డేట్ నీ ఇవ్వనున్నారు.

సుకుమార్ ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. సుకుమార్ అల్లు అర్జున్ కి ఇలా ట్రీట్ ఇవ్వడం, అభిమానులకు కూడా పండగే. అలా వైకుంఠ పురంలో బ్లాక్ బస్టర్ చిత్ర తర్వాత చేస్తున్న ఈ చిత్రం పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సుకుమార్ ఈ చిత్రంలో అల్లు అర్జున్ నీ ఊర మాస్ లుక్ లో చూపించనున్నారు.