హాట్ టాపిక్ : పెళ్లి పీటలు ఎక్కనున్న సాహొ దర్శకుడు సుజిత్

Wednesday, June 3rd, 2020, 12:40:41 PM IST

లాక్ డౌన్ సమయంలో కూడా కొందరు సినీ ప్రముఖులు తమ వివాహ వేడుక లను జరుపుకుంటున్నారు. ఇప్పటికే ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండవ వివాహం చేసుకున్నారు. అలానే నిఖిల్ కూడా లాక్ డౌన్ నిబంధనలను మీరకుందా పెళ్లి చేసుకున్నాడు. హీరో నితిన్ సైతం పెళ్లి చేసుకొనేందుకు సిద్దంగా ఉన్నారు. దగ్గుబాటి రానా సైతం తన ప్రేమ కు గ్రీన్ సిగ్నల్ అందింది అని అన్నారు. త్వరలో ఈ జంట సైతం పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉంది.

అయితే ఈ లాక్ డౌన్ సమయం లో సా హొ చిత్ర దర్శకుడు సుజిత్ తన ప్రేయసి ప్రవల్లిక తో నిశ్చితార్థం జరుపుకోనున్నారు. ఈ నెల 10 వ తేదీన వీరి నిశ్చితార్థం జరిగి అవకాశం ఉన్నది అని తెలుస్తోంది. అయితే ఇదే సమయం లో వారు పెళ్లి కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల తన ప్రేమ ను ఇరువురు కుటుంబాలు అంగీకారం తెలిపినట్లు సమాచారం. ప్రవల్లిక డాక్టర్ గా తన వృత్తి నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే సుజిత్ సైతం తన నెక్స్ట్ సినిమా కోసం ఎంతగానో కష్ట పడుతున్నారు. చిరు తో లూసీ ఫర్ రీమేక్ ను తెరకెక్కించ నున్నారు సుజిత్. చిరు ఆచార్య చిత్రం పూర్తి అయ్యాక ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది.