సుద్దాల అశోక్ తేజ కి తీవ్ర అస్వస్థత…?

Thursday, May 21st, 2020, 03:41:08 PM IST


తన సొంత ఊరు పేరునే, తన ఇంటి మార్చుకొని, తన కలంతో గళమెత్తి, ప్రజల్లో సామాజిక స్పృహని నింపినటువంటి ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ నేడు తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు. కాగా తక్షణమే స్పందించిన కుటుంబ సభ్యులు, ఆయనని గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చేర్పించగా, ఆయనని పరీక్షించిన వైద్యులు, సుద్దాల అశోక్ తేజకి కాలేయ మార్పిడి చికిత్స చేయనున్నట్టు సమాచారం. కాగా ఆయనకు సంబందించిన బ్లడ్ గ్రూప్ బీ నెగెటివ్ కావడం వలన, సస్త్ర చికిత్స సమయంలో అధిక మొత్తంలో రక్తం అవసరమవడం వలన అందుకు కావాల్సిన ఏర్పాటు చేసుకోవాలని, వైద్యులు కుటుంబ సభ్యులకు తెలియజేశారని సమాచారం. .కాగా ఈ వార్త విన్నటువంటి సినీపరిశ్రమ, ఆయన అభిమానులు అందరు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.