స్టార్ మహిళ మళ్ళీ వచ్చేస్తుందోచ్.. కానీ మూడు రోజులు మాత్రమే..!

Wednesday, August 12th, 2020, 04:50:10 PM IST

starmahila_relaunch

యాంకర్ సుమ.. ఈ పేరు తెలుగు ఆడపడుచులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. దాదాపు మూడు జనరేషన్లకు నచ్చిన ఏకైక యాంకర్ ఎవరైనా ఉన్నారంటే అది సుమ అనే చెప్పాలి. బుల్లితెరపై ఎన్నో షోలకు యాంకరింగ్ చేసినా సుమ ఇటీవల ఓ ప్లాష్ న్యూస్ అంటూ మీ ఫేవరెట్ షో మళ్ళీ రాబోతుందని చెప్పింది గుర్తుందనుకుంటా.

అవునండోయ్ మీరనుకున్నదే నిజమయ్యింది. ఈ ఫేవరెట్ షో “స్టార్ మహిళ”తో సుమ మళ్ళీ మిమ్మల్ని అలరించేందుకు రాబోతుంది. ఈ నెల 17 వ తేది నుంచి మధ్యాహ్నాం 12:30 గంటలకు మీ ఈటీవీలో మళ్ళీ స్టార్ మహిళ ప్రసారం కానుంది. అయితే ఇక్కడ ఓ చిన్న డిసప్పాయింట్ ఏమిటంటే ఈ షో కేవలం మూడు రోజులు మాత్రమే అంటే సోమవారం నుంచి బుధవారం వరకు మాత్రమే అన్నమాట. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబధించిన ఓ ప్రోమోను రిలీజ్ చేశారు నిర్వాహకులు. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ కొత్త ప్రోమో వైపు ఓ లుక్కేయండి.