వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రెండు సినిమాలతో “స్టార్ మా”.!

Friday, May 22nd, 2020, 11:35:37 AM IST

ఇప్పుడు మన తెలుగులో జెమినీ టీవీ మరియు స్టార్ మా ఛానెల్స్ వారు సినిమాలతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు ఒకదానికి ఒకటి బాగానే పడుతున్నాయి. జెమినీ ఛానెల్లో ఏమో కొత్త సినిమాలతో మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటే స్టార్ మా వారు మాత్రం కొత్త సినిమాలతో పాటు పలు పాత చిన్న సినిమాలను కూడా డిగ్ చేస్తున్నారు. అలా తవ్విన రెండు చిత్రాలను స్టార్ మా వారు ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

మొదటగా నవీన్ విజయ్ కృష్ణ హీరోగా శ్రావ్య హీరోయిన్ గా పివి గిరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “నందిని నర్సింగ్ హోమ్” ఈ చిత్రాన్ని వచ్చే బుధవారం టెలికాస్ట్ చేస్తుండగా ఈ ఆదివారం హావీష్ హీరోగా రెజీనా, శ్రద్ధ శ్రీనాథ్, నందిత శ్వేతా లాంటి పలువురు కీలక నటులు నటించి రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “7” ను టెలికాస్ట్ చేయనున్నారు. ఈ చిత్రానికి నాజర్ షఫీ దర్శకత్వం వహించారు..మొత్తానికి మాత్రం ఈ లాక్ డౌన్ సమయాన్ని స్టార్ మా వాళ్ళు కూడా గట్టిగానే వాడేస్తున్నారని చెప్పాలి.