ఆయనతో పని చేయడం గొప్ప అనుభవం – రాజమౌళి

Tuesday, September 8th, 2020, 06:30:33 PM IST

Rajamouli Jayaprakash Reddy

జయ ప్రకాష్ రెడ్డి గారి మరణం తో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. పలువురు ప్రముఖులు, సినీ రంగానికి చెందిన వారు, ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి సైతం భావోద్వేగానికి గురి అయ్యారు. ఆయన హఠాన్మరణం కలిచివేసింది అని, ఆయన మరణం సినీ పరిశ్రమ కి తీరని లోటు అని అన్నారు. ఖైదీ నెంబర్150 లో ఆఖరి సారి జయ ప్రకాష్ రెడ్డి తో నటించినట్లు పేర్కొన్నారు. నాటకరంగం కన్న తల్లి లాంటిది అని, సినిమా రంగం పెంచిన తల్లి లాంటిది అని, శని, ఆది వారాల్లో షూటింగ్ పెట్టుకొను అని అన్నారు. స్టేజ్ మీద ప్రదర్శన ఇచ్చే సమయంలో మీరెప్పుడైనా రావాలి అని చిరు ను అడిగేవారు అని తెలిపారు. ఆ అవకాశాన్ని పొందలేకపోయా అని అన్నారు.

అయితే రాయలసీమ మాండలికాన్ని పలకడం లో జయ ప్రకాష్ రెడ్డి గారు తనదైన బాణీ చూపరు అని పవన్ పేర్కొన్నారు. గబ్బర్ సింగ్ పాత్రలో తనతో నటించిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. తాను ఎంత బిజీగా ఉన్నా, నాటక రంగాన్ని మరువలేదు అని, తెలుగు సినీ, నాటక రంగాలకు తీరని లోటు అని పవన్ కళ్యాణ్ అన్నారు.

అయితే జయ ప్రకాష్ రెడ్డి గారి హఠాన్మరణం గురించి షాక్ అయ్యా అని, చాలా బాధ పడ్డా అని దర్శక ధీరుడు రాజమౌళి అన్నారు. ఆయనతో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం అని అన్నారు.కొన్ని దశాబ్దాలుగా, మధురమైన కమెడియన్ పాత్రలు,విలన్ పాత్రలు పోషించి వినోదం పంచినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. తన ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అని రాజమౌళి తెలిపారు.

అయితే జయ ప్రకాష్ రెడ్డి మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ కి చెందిన వారు మాత్రమే కాకుండా, ఇతర ప్రాంతాలకు చెందిన వారు సైతం విచారం వ్యక్తం చేశారు.