“సర్కారు వారి పాట” క్రేజీ ప్లాన్…ఎంటో తెలుసా!?

Friday, August 7th, 2020, 02:40:06 AM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు వేడుకలు ముందుగానే మొదలు అయ్యాయి. సోషల్ మీడియా లో ఇపుడే ఆ హడావిది కనిపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన ప్రతి చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అటు క్లాస్, ఇటు మాస్ అభిమానులను అలరిస్తోనే, తనకు నచ్చిన సినిమాలు చేస్తూ పోతున్నారు మహేష్. అయితే తాజాగా సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్న మహేష్ ఈ చిత్రానికి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ మహేష్ బాబు పుట్టిన రోజున విడుదల కి సిద్దం గా ఉంది.

అయితే మహేష్ బాబు వాయిస్ మెసేజ్ వచ్చే లా సంగీత దర్శకుడు తమన్ ఒక ఫోటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. అయితే అది పాట కూడా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహేష్ బాబు వాయిస్ తో ఉన్న మెసేజ్ లేదా పాట అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మహేష్ చాలా చిత్రాలకు మెసేజ్ వాయిస్ ఇచ్చారు. బిజినెస్ మాన్ చిత్రం కోసం పాటను కూడా పాడారు. అయితే ఈ చిత్రం నుండి విడుదల అయ్యే అప్డేట్ కోసం అభిమానులు ఇప్పటినుండే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.