పవన్ అభిమానులకు అద్దిరిపోయే సర్ప్రైజ్ ప్లాన్ చేసిన వేణు శ్రీరామ్!

Tuesday, August 11th, 2020, 02:19:33 AM IST

Vakeel_sab
పవన్ కళ్యాణ్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా వచ్చి దాదాపు మూడేళ్లు కావడం తో అభిమానులు వకీల్ సాబ్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే పోస్టర్, మరియు మగువ మగువ పాట విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇవి ప్రేక్షకుల్ని, అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ చిత్రం నుండి మరో సర్ప్రైజ్ రానుంది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సర్ప్రైజ్ విడుదల చేయనున్నట్లు దర్శకుడు వేణు శ్రీరామ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

సెప్టెంబర్ 2 న స్పెషల్ సర్ప్రైజ్ ఫ్రమ్ వకీల్ సాబ్ టీమ్ అంటూ దర్శకుడు వేణు శ్రీరామ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే ఈ అనౌన్స్ మెంట్ తో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా విడుదల వాయిదా పడగా, ఈ చిత్రం లాక్ డౌన్ నిబంధనల తొలగింపు అనంతరం విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.