మెరుగైన వైద్య అందిస్తున్నా, ఆరోగ్య పరిస్తితి లో మార్పు లేదు – ఎస్పీ చరణ్

Friday, August 21st, 2020, 02:04:10 AM IST


ప్రముఖ గాయకుడు, లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్తితి పై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ పలు వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్తితి లో ఎటువంటి మార్పు లేదు అని తెలిపారు. నిన్నటి తో పోల్చితే మా నాన్నగారి ఆరోగ్యం పరిస్తితి లో ఎలాంటి మార్పు లేదు అని, మెరుగైన వైద్య అందిస్తున్నా మార్పు లేదు అని అన్నారు. అయితే మీ ప్రార్థనలు, ఆశీస్సులతో ఆయన ఆరోగ్యం మెరుగవుతుంది అని భావిస్తున్నా అంటూ తెలిపారు.

అయితే తమ కుటుంబానికి అండగా నిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు చరణ్. అంతేకాక బాలుగారి ఆరోగ్యం కోసం ఎప్పటికపుడు అడిగి తెలుసకుంటున్న సినీ పరిశ్రమ, సంగీత పరిశ్రమ లోని అందరికీ ధన్యవాదాలు అని తెలిపారు. అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొస. దేశ వ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్న సంగతి తెలిసిందే.