నాన్న ఐపియల్ కోసం ఆతృత గా ఎదురుచూస్తున్నారు – ఎస్పీ చరణ్

Monday, September 7th, 2020, 06:39:23 PM IST

గత కొద్ది రోజులుగా సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం పై అభిమానులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే తాజాగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కి కరోనా వైరస్ నెగటివ్ అని తనయుడు ఎస్పీ చరణ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే నాన్న ఆరోగ్యం కి సంబంధించిన అప్డేట్ వారాంతం లో ఇవ్వలేక పోయా క్షమించండి అని తెలిపారు.

అయితే గతంతో పోల్చితే నాన్న ఊపిరితిత్తుల పని తీరు బావుంది అని, తెలిపారు. అయితే ఇన్ఫెక్షన్ ఉండటం వలన ఇంకా వెంటి లేటర్ ను తొలగించలేదు అని అన్నారు. అయితే కరోనా నెగటివ్ వచ్చిన విషయాన్ని తెలుపుతూ, కరోనా వైరస్ పాజిటివ్ మరియు నెగటివ్ అన్నది సమస్య కాదు అని, నాన్న ఊపిరితిత్తులు బాగా మెరుగు అవ్వాలి అని అన్నారు. అయితే వారాంతం లో వార్షికోత్సవ సెలబ్రేట్ చేశాం అని, నాన్న తన ఐపొడ్ లో క్రికెట్ మరియు టెన్నిస్ చూస్తున్నారు అని అన్నారు. అంతేకాక ఐపియల్ కోసం ఎంతో ఆత్రుత గా ఎదురు చూస్తున్నారు అని ఎస్పీ చరణ్ తెలిపారు.