ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్తితి మరింత విషమం

Friday, August 14th, 2020, 06:07:41 PM IST

సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో నిన్న రాత్రి వైద్యులు లైఫ్ సపోర్ట్ పై చికిత్స ప్రారంభించారు. ఐసియూ కి తరలించి, మెరుగైన చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఈ నెల 5 వ తేదీన కరోనా లక్షణాలతో చెన్నై లోని ఎంజీఎం ఆసుపత్రి లో చేరారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అయితే నిన్న రాత్రి కాస్త ఆరోగ్యం విషమం గా ఉండటం తో ఐసీయూ కి తరలించారు.

అయితే నేడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం పై హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఎంజీఎం ఆసుపత్రి యాజమాన్యం పలు కీలక విషయాలను వెల్లడించారు. ఇప్పటికే పరిస్తితి క్రిటికల్ గా ఉంది అని వైద్యులు అంటున్నారు. అంతేకాక మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నాం అని, నిపుణులు పర్యవేక్షణ లో చికిత్స చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా వైరస్ భారిన పడి కోలుకున్నారు. తెలుగు లో ఎంతో గొప్ప సింగర్ గా రాణించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, తమిళ్, మలయాళ, ఇతర భాషల్లో కూడా పాటలను పాడారు.