ఇంకా విషమం గానే ఎస్పీ బాలు ఆరోగ్యం – ఎంజీఎం ఆసుపత్రి

Wednesday, August 19th, 2020, 08:43:38 PM IST


కరోనా వైరస్ భారిన పడిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంకా చెన్నై లోని ఎంజీఎం ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే తాజాగా ఎస్పీ బాలు ఆరోగ్యం కి సంబంధించి ఎంజీఎం ఆసుపత్రి హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది. ఇంకా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషమం గానే ఉంది అని వైద్యులు తెలిపారు. ఇంకా వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్న విషయాన్ని తెలిపారు. అయితే వెంటిలేటర్ పై ఉన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని నిపుణుల పర్య వెక్షణలో ఉంచినట్లు వైద్యులు తెలిపారు.

అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రార్థిస్తున్నారు. అంతేకాక ఈ నెల 20 న సామూహికంగా ప్రార్థనలు చేసేందుకు చెన్నై ప్రముఖులు సిద్దం అయ్యారు. ఇందుకు సంబంధించి ఒక ప్రకటన సైతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. టాలీవుడ్ నటులు సైతం ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలని కోరారు.