నిలకడగా ఎస్పీ బాలు ఆరోగ్యం!

Friday, August 14th, 2020, 10:13:11 PM IST

కరోనా వైరస్ సోకి ఈ నెల అయిదవ తేదీన చెన్నై లోని ఎంజీఎం లో చేరిన ఎస్పీ బాలు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. అందుకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. నిన్న రాత్రి ఐసీయు లో చేరిన ఎస్పీ బాలు ఆరోగ్యం పై ఆసుపత్రి యాజమాన్యం హెల్త్ బులిటెన్ విడుదల చేయగా, పరిస్తితి కాస్త క్రిటికల్ అని తెలిపింది. అయితే చికిత్స కోసం నిపుణుల పర్యవేక్షణ లో ఉంచిన విషయాన్ని వైద్యులు తెలిపారు. అయితే ఇపుడు ఆరోగ్యం నిలకడగా ఉంది.

ఎస్పీ బాలు ఆరోగ్యం గా ఉన్న విషయాన్ని తన కుమారుడు మీడియా ద్వారా వెల్లడించారు. అయితే ఎస్పీ బాలు థంబ్స్ అప్ తో ఉన్నటువంటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఎస్పీ బాలు ఆరోగ్యం గా ఉండటం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.