చాగంటి, సామవేదం, తనికెళ్ళభరణి అద్భుత మాటలన్నా… పురాణపండ శ్రీనివాస్ మహా గ్రంధాలన్నా ‘ బాలు’ కి చాలా ఇష్టం

Sunday, September 27th, 2020, 02:58:30 AM IST

Puranapanda Srinivas, sp balasubrahmanyam

చెన్నై: సెప్టెంబర్ : 26

భారతీయ స్వర వర పుత్రుడు ఎస్ .పీ . బాలసుబ్రహ్మణ్యం అమరలోకాలకు తరలి వెళ్లడంతో దేశమంతా వున్నసినీ, రాజకీయ , సంగీత, కళా రంగాలలో తీవ్ర ఆవేదన పెల్లుబికి ఎన్నో జ్ఞాపకాలు, అనుబంధాలు ఆవిష్కృతమవుతున్నాయి.

మహోన్నత ఉజ్వల స్వర ధీమంతుడైన ఎస్ .పీ . బాలసుబ్రహ్మణ్యంకి భక్తి చాలా ఎక్కువనే విషయం అందరికీ తెలిసిందే. సాక్షాత్తూ శివుడే సంచరించే కాశీక్షేత్రమన్నా, భరతభూమి శత సహస్రాలు సమర్పించే కంచి కామకోటి పీఠమన్నా, వైదిక వైభవాన్ని విస్తృతపరిచే మహోపన్యాసకులు సామవేదం షణ్ముఖ శర్మన్నా, ధార్మిక వైభవాన్ని దిగంతాలకు వ్యాప్తి చేసిన పరమోత్తమ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావన్నా, చక్కని విలువల మంచి మనిషి గొప్ప రచయిత , నటులు తనికెళ్ళ భరణి అద్భుతమైన మాటలన్నా , ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ మంత్ర వైభవ గ్రంధాల పవిత్ర సొగసుల వ్యాఖ్యానాలన్నా, పురాణపండ శ్రీనివాస్ మహా గ్రంధాలన్నా బాలసుబ్రహ్మణ్యానికి చాలా ఇష్టం .

బాల సుబ్రహ్మణ్యం ఎక్కడ వున్నా ప్రభాతవేళ కాస్సేపు ప్రార్ధన చేసుకునేవారు. తన పూజార్చనల్లో ఎక్కువభాగం దివ్య గ్రంధాలు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ , ప్రముఖ ప్రచురణ సంస్థ వావిళ్ళ రామస్వామి శాస్త్రి బుక్ డిపో వారివే కావడం గమనార్హం.

రెండువేల ఏడవ సంవత్సరంలో వంశీ ఆర్ట్ థియేటర్ వారు హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన ఒక సభలో ముఖ్య అతిథిగా గానగంధర్వుడు ఎస్ .పీ. బాలసుబ్రహ్మణ్యం పాల్గొనగా , అదే సభను ఆనాటి శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ ప్రారంభించారు. నాటి సభలో మంగళమయ ప్రసంగం చేసిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ఎస్.పీ . బాలసుబ్రహ్మణ్యం గురించి మాట్లాడుతూ … ‘ మేధాశక్తి, ధారణాశక్తి,,వక్తృత్వసామర్ధ్యం , సాంకేతిక పరిజ్ఞానం, స్వర వైభవం, సామాజిక స్పృహ, కలుపుగోలుతనమ్, ప్రసన్నవదనం, నిర్భయత్వం, సమయస్ఫూర్తి, దృఢచిత్తం, లక్ష్యశుద్ధి, దార్శనికత, ఖఛ్చితత్వం, సంస్కారం , వినయం ‘ … ఈ పదహారు గుణాలూ మూర్తీభవించిన స్వరస్వరూపమే బాలసుబ్రహ్మణ్యం గారనగానే ‘ ఆడిటోరియం జయ జయ ధ్వానాలతో మార్మ్రోగిపోయింది. పురాణపండశ్రీనివాస్ వాగ్వైభవానికి బాలు పులకించిపోయారు.

ఆనాటి నుండి … పురాణపండ శ్రీనివాస్ ప్రతీ రచన లేదా సంకలనం బాలసుబ్రహ్మణ్యంకి చేరుతూనే వుంది . స్వర సార్వభౌముడైన బాల సుబ్రహ్మణ్యం నాలుగేళ్ళనాడు కాశీక్షేత్రంలో చింతామణి గణపతి దేవాలయం వద్ద సతీ సమేతంగా శివలింగ ప్రతిష్ట చేసినప్పుడుకూ కూడా పురాణపండ శ్రీనివాస్ చేత ఒక అపురూప ఆధ్యాత్మిక దివ్యగ్రంధాన్ని ప్రచురింపచేసి కాశీ విశ్వనాధుని పాదాల సన్నిధానంలో భక్తులకు వితరణచెయ్యడం మరో విశేషం. ఇప్పుడీ ఫోటోలో బాలు తో ముచ్చ్చటిస్తున్న వ్యక్తే,, బాలు నుండి జ్ఞాపిక స్వీకరిస్తున్న వ్యక్తే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో వేలాది పాఠకుల హృదయాల చేత భగవంతుణ్ణి కీర్తింప చేస్తున్నఅద్భుత గ్రంధాల ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ . ఆనాటి ఫోటో ఇది.

పురాణపండ శ్రీనివాస్ మీసం లేకుండా వున్న ఈ ఫోటో ఆయన ఒక డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరరుగా ఉద్యోగిస్తున్న తరుణంలోనిది . ఈయన గ్రంధాలోని అంశాలే బాలు నిత్య ప్రార్థనల్లో స్తుతించే మంగళ శబ్దాలు. పురాణపండ శ్రీనివాస్ కి బాలు తో సుమారు దశాబ్దంన్నర కాలంనుండీ పరిచయమని దీని సారాంశంగా తెలుస్తోంది. ఈ విషాద సందర్భంలో ఒక స్థానిక ఎలక్ట్రానిక్ మీడియాలో పురాణపండ శ్రీనివాస్ మాట్లాడుతూ … స్వర్గంలో స్వర మహోత్సవానికి గాంధర్వ లోకాలమీంచి వెళ్తున్న బాలసుబ్రహ్మణ్యంగారికి దేవతాశక్తులు శాంతియుత మంగళాశాసనాలు చేస్తాయని గద్గద స్వరంతో చెప్పి అంజలి ఘటించడం కంటతడి పెట్టించింది. గత కొంతకాలంగా బాలు ఎక్కడికి క్యాంపుకి వెళ్లినా … తన కూడా ‘ నన్నేలు నా స్వామి’ అనే ఆంజనేయ అఖండ మహాగ్రంధాన్ని తీసుకెళ్లేవారని సన్నిహితులు చెబుతున్నారు. ఈ అద్భుతగ్రంధం కూడా ప్రముఖరచయిత పురాణపండ శీనివాస్ అపురూప విలువల రచనా సంకలనమే. ప్రత్యేకంగా హనుమంతునిపై విడుదల చేసిన ఈ మహాగ్రంధాన్ని ఈ దేశ హోంశాఖామంత్రి అమిత్ షా ఆవిష్కరించి పురాణపండను అభినందించారు. దేశంలో ఇంతవరకూ ఇలాంటి గ్రంధం వెలువడలేదని ఇప్పటికే ఎందరో మహాత్ములు చెప్పేసారు కూడా.అలాంటి అద్భుత గ్రంథమిది. ఈ మహాగ్రంధంలోని హనుమంతుని అరుదైన చిత్రాలన్నా, మంత్రసమూహమన్నా బాలుకి చాలా ఇష్టమని గత సంక్రాంతి నాడు ఒక ఛానల్ ఇంటర్వ్యూలో బాలు చెప్పారుకూడా.

ఏది ఎమైనా ఒక స్వర శకం ముగిసింది. ఒక స్వర శిఖరం ఒరిగింది. దైవభక్తి కలిగిన బాలు స్వరాన్ని భక్తిగా పిలుచుకునే లక్షల అభిమానులకు ఇది మహా విషాదం. ఈ సందర్భంలో ఒకసారి బాలు భక్తి విశేషాల్ని జ్ఞప్తి తెచ్చుకోటం కోసమే ఈ అంశం.