దక్షిణాసియా సెలబ్రెటీ దాతల జాబితాలో సోనూసూద్ నెంబర్ వన్‌..!

Friday, December 11th, 2020, 11:30:30 PM IST

సమాజం కోసం తారలు ఇచ్చే విరాళాలు, వారి సేవల ఆధారంగా బ్రిటన్ వారపత్రిక ఈస్టర్న్ ఐ దక్షిణాసియా సెలబ్రిటీ దాతల జాబితాను వెల్లడించింది. అయితే ఈ జాబితాలో సోనూ సూద్ నెంబర్ వన్‌గా నిలిచాడు. కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న ఎందరికో తనవంతు సాయం అందచేస్తూ రీల్ లైఫ్‌లో విలన్ పాత్రలు పోశించినా రియల్ లైఫ్‌లో నిజమైన హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. ఇప్పటికీ ఏదో ఒక రూపేణా సోనూ సూద్ దాతృత్వ సేవలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇక ఈ జాబితాలో టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్‌ ఏడో స్థానంలో నిలిచాడు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభాస్ పలు ప్రభుత్వాలకు దాదాపు 4 కోట్ల విరాళం ఇచ్చారు. కరోనా క్రైసిస్ చారిటీకీ 50 లక్షలు, ఖాజీపల్లి వద్ద 1,650 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకోవడం, ఆ రిజర్వ్ ఫారెస్ట్ అభివృద్ధి కోసం 2 కోట్ల విరాళం ప్రకటించడం వంటివి ప్రభాస్ చేసిన సంగతి తెలిసిందే. ఇక భారత్ నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్నవారిలో ప్రియాంక చోప్రా 6వ స్థానంలో ఉండగా, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ 20వ స్థానంలో ఉన్నారు.