నేను మొదటి కారు కొన్నప్పుడు కూడా ఇంత సంతోషించలేదు – సోనూసూద్

Friday, August 21st, 2020, 12:23:44 PM IST

రీల్ లైఫ్‌లో విలన్ పాత్రలు పోశించినా రియల్ లైఫ్‌లో నిజమైన హీరో అనిపించుకుంటున్నాడు. కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న ఎందరికో తనవంతు సాయం అందచేస్తూ వస్తున్న సోనూసూద్ జనాలకు ఆపద్బాందవుడులా మారిపోయాడు. తమ కష్టాలు చెప్పుకునే వారికి ఆయన కేరాఫ్ అడ్రస్ అయిపోయాడు.

అయితే తాజాగా బీహార్‌లోని చంపారన్‌కు చెందిన భోలా అనే వ్యక్తి వరదల్లో తన కొడుకును, తన ఏకైక ఉపాధి మార్గమైన గేదెను పోగొట్టుకున్నాడు. ఈ విషయం సోనూ దృష్టికి రావడంతో వెంటనే బోలాకు ఓ గేదెను కొనిచ్చాడు. ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా స్పందించిన సోనూ “నేను మొదటి కారు కొన్నప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదని బీహార్‌కు వచ్చినప్పుడు ఆ గేధె పాలు ఓ గ్లాసు తాగుతా” అని ట్వీట్ చేశాడు.