ఈ గొప్పదనం అంతా అమ్మానాన్నలదే – సోనూ సూద్

Monday, November 16th, 2020, 11:31:30 AM IST

Sonu-Sood

కరోనా వైరస్ మహమ్మారి కాలం లో వలస కార్మికు కష్టాలను తీర్చారు నటుడు సోనూ సూద్. అయితే సోనూ సూద్ నుండి సహాయం పొందిన వారు సోనూ సూద్ ను దేవుడు అంటూ పలుమార్లు కామెంట్లు కూడా చేశారు. అయితే ఈటీవీ లవ్ ప్రసారం అయిన శ్రీ కనక మహాలక్ష్మి లక్కీ డ్రా కార్యక్రమం లో సోనూ సూద్ సహాయం పొందిన వారు పాల్గొని తమ బాధలను పంచుకున్నారు. అయితే ఈ మేరకు సోనూ సూద్ పై ప్రశంసల వర్షం కురిపించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈవెంట్ లో పాల్గొన్న సోనూ సూద్ ను రోజా ప్రశంసల తో ముంచెత్తారు.

అయితే ఈ కార్యక్రమం లో రోజా ఇందుకు స్ఫూర్తి ఎవరూ అంటూ సోనూ సూద్ ను సూటిగా ప్రశ్నించారు. అయితే ఈ గొప్పదనం అంతా అమ్మానాన్న లదే అంటూ చెప్పుకొచ్చారు. అమ్మ సరోజ్ సూద్ వృత్తి రీత్యా ప్రొఫెసర్ అని, వృత్తి పరమైన పనుల నిమిత్తం ఆమె ఎన్నో గ్రామాలకు వెళ్తూ ఉండేవారు అని, అక్కడ ఎంతో మంది చిన్నారులను చెరదీసేది అని, కొందరి పాటశాల, కళాశాల ఫీజులను అమ్మే చెల్లించేది అని చెప్పుకొచ్చారు. అయితే వాళ్ళ అమ్మ చెప్పిన విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. నిజమైన సక్సెస్ అంటే ఒకరికి సాయం అవసరం అయినప్పుడు వాళ్లకు అడగకముందే సాయం చేయడం అని అన్నారు. నేను ఏదైతే చేస్తున్నానో దానికి కారణం అమ్మా నాన్న లే అంటూ సోనూ సూద్ అన్నారు.