ఆమె ‘లేడీ రజనీ ఆఫ్ ముంబై’ట!

Thursday, May 21st, 2015, 04:06:28 PM IST

sonakshi
తమిళంలో సూపర్ హిట్ అయిన మౌన గురు చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు మురుగుదాస్ ‘అకీరా’ పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షీ సిన్హా తన తండ్రి శత్రుఘ్న సిన్హాతో కలిసి తొలిసారి నటిస్తోంది. ఇక అకీరా సినిమాలో సొనాక్షీ నటనకు మురుగుదాస్ ఫిదా అయిపోయాడట. అంతేకాకుండా ఉన్నపళంగా సోనాక్షికి అభిమానిగా మారిన మురుగుదాస్ ‘లేడీ రజనీ ఆఫ్ ముంబై’ అంటూ ఆమెను ప్రశంసలలో ముంచెత్తుతున్నాడని తెలుస్తోంది.

ఇక ఈ మేరకు సోనాక్షీ సిన్హా డైలాగ్ డెలివరీకి ముగ్ధుడైన మురుగుదాస్ ఆమె నటనను కొనియాడుతూ ‘తేవర్’ సినిమాలో సోనాక్షి నటించిన ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. కాగా సోనాక్షి గతంలో కూడా మరో తమిళ దర్శకుడు ప్రభుదేవా నుండి ఇలాంటి కాంప్లిమెంట్లనే అందుకున్న నేపధ్యంలో తమిళ దర్శకులను సోనాక్షీ భలే ఆకట్టుకుంటోదంటూ బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.