‘సోలో బ్రతుకే సో బెటర్’ 11 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

Wednesday, January 6th, 2021, 02:58:53 AM IST


మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, నభా నటేష్‌ జంటగా కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్స్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ తర్వాత థియేటర్లలో విడుదలవుతున్న మొదటి చిత్రం ఇదే కావడంతో ప్రేక్షకులు నుంచి కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

అయితే థియేటర్లలో 50 శాతం సీటింగ్ కెపాసిటీతో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లను సొంతం చేసుకుంటుంది. ఈ సినిమా విడుదలైన తొలిరోజు 4 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం రెండో రోజు కూడా 3 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా 11 రోజులకుగానూ దాదాపు 20 కోట్ల గ్రాస్, 12.2 కోట్ల షేర్ వసూలు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాను 10 కోట్లకు అమ్మడంతో దాదాపుగా చిత్ర యూనిట్‌కు 2 కోట్లకు పైగా లాభాలు వచ్చినట్టు తెలుస్తుంది.