దేశంలోనే ఏ హీరోకి చెయ్యని విధంగా మెగాస్టార్ కు.!

Sunday, August 9th, 2020, 03:45:11 PM IST

Chiru_birthday

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఆగష్టు నెలలోనే ఆయన పుట్టినరోజు కావడంతో ఇప్పటికే అభిమానుల్లో ఆ సందడి వాతావరణం మొదలయ్యిపోయింది. మామూలుగానే మన దగ్గర స్టార్ హీరోల పుట్టినరోజు వేడుకలు అంటే తారా స్థాయిలో జరుగుతాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు మరియు కాలం కూడా మారిపోవడంతో సోషల్ మీడియాలోనే ఈ సంబరాలు హోరెత్తుతున్నాయి.

ఇప్పుడు ఈ ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడంతో మన దేశంలోనే ఏ స్టార్ హీరోకు చెయ్యని విధంగా ఆయన కామన్ మోషన్ టీజర్ ను టాప్ స్టార్స్ 65 మంది విడుదల చేతుల మీదుగా ట్విట్టర్ లో విడుదల చెయ్యనున్నారు. ఇది మాత్రం ఒక్క మెగాస్టార్ కు మాత్రమే సాధ్యం అయ్యిందని చెప్పాలి. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ టీజరే ఓ రేంజ్ లో ఉంది. మరి ఈ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి.