సలార్ లో ప్రభాస్ కి జోడీ గా తనేనా?

Thursday, January 28th, 2021, 09:30:03 AM IST

ప్రభాస్ కథానాయకుడి గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం సలార్. ఈ చిత్రం ఈ నెల 29 వ తేదీ నుండి రామగుండం లోని సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాంతం లో షూటింగ్ జరుపుకొనుంది. అయితే a ప్రాంతం లో ఇప్పటికే చిత్ర యూనిట్ సెట్టింగ్ పనులను శరవేగంగా పూర్తీ చేస్తోంది. ప్రభాస్ హై ఓల్టేజ్ ఫైట్ సీన్స్ ను అక్కడ బొగ్గు గనిలో చిత్రీకరించనున్నారు.

అయితే ఈ చిత్రం లో హీరోయిన్ ఎవరు అనే దాని పై ఇంకా ఒక క్లారిటీ రాలేదు. ఈ చిత్రం లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకూ వీరిద్దరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాకపోవడం తో వీరిద్దరూ కలిసి నటించే అవకాశం ఉంది అని తెలుస్తోంది. అయితే ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ బరిలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది ప్రభాస్ రాధే శ్యామ్ విడుదల కానున్నది. ప్రభాస్ వీటితోపాటు ఆది పురుష్ మరియు నాగ్ అశ్విన్ లతో సినిమాలు చేయనున్నాడు. ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.